హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో అక్రమంగా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి ఎస్ఆర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 9 బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఆర్ నగర్ సీఐ సైదులు తెలిపారు.
Black fungus : బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల విక్రయం.. ఐదుగురి అరెస్ట్ - బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు విక్రయుస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
![Black fungus : బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల విక్రయం.. ఐదుగురి అరెస్ట్ sr nagar police arrested 5 members for selling block fungus injections in black market](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:54:08:1623576248-12117852-fungus.jpg)
అక్రమంగా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ఐదుగురి అరెస్ట్
బీకే గూడలోని కొందరు వ్యక్తులు ఇచ్చిన పక్కా సమాచారంతోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ సైదులు తెలిపారు. ఒక్కో ఇంజక్షన్‌ను 35 వేల రూపాయలకు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ