తెలంగాణ

telangana

ETV Bharat / crime

Aqua Farm : లంకవానిదిబ్బలో అనుమతి లేకుండా రొయ్యల సాగు... దర్యాప్తులో వెల్లడి - gutur crime news

ఏపీలోని గుంటూరు జిల్లా లంకవానిదిబ్బ అగ్నిప్రమాదం వల్ల ఆరుగురు మరణించిన ఘటనలో రొయ్యల చెరువుకు అనుమతి లేదని విచారణలో తేలింది. పైగా అసైన్డు భూముల్లోనే సాగు జరుగుతన్నట్లుగా అధికారులు గుర్తించారు. రొయ్యల చెరువు కోసం తీసుకున్న విద్యుత్తు కనెక్షన్‌ను ఇంటి అవసరాకు వాడుతూ.. ప్రభుత్వం రాయితీని దుర్వినియోగం చేస్తున్నట్లుగా దర్యాప్తులో గుర్తించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద అధికారులు నగదు అందించారు.

లంకవానిదిబ్బలో అనుమతి లేకుండా రొయ్యల సాగు
లంకవానిదిబ్బలో అనుమతి లేకుండా రొయ్యల సాగు

By

Published : Aug 1, 2021, 9:24 AM IST

లంకవానిదిబ్బలో అనుమతి లేకుండా రొయ్యల సాగు

ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో రొయ్యల చెరువు వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతిచెందారు. ఇక్కడ బెయిలీ ఆక్వాఫాం పేరుతో సుమారు 90 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. వీటిలో కొన్ని మాత్రమే పట్టాభూములు కాగా... మరికొన్ని అసైన్డ్​ భూములు ఉన్నాయని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. మత్స్యశాఖ నుంచి అనుమతి పొందేందుకు అసైన్డ్‌ రైతు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ అసైన్డ్‌ రైతులెవరూ దరఖాస్తు చేసుకోలేదని.. చెరువుకు ప్రభుత్వ అనుమతులూ లేవని తేలింది. దీంతో ఆక్వా సాగులో నిబంధనలు పాటిస్తున్నారా ?.. ఎలాంటి రసాయనాలు వాడుతున్నారనే విషయంపై నిఘా కొరవడిందన్న విషయం బహిర్గతమవుతోంది. సున్నం, బ్లీచింగ్‌తోపాటు రసాయనాలు కలిపిన నిల్వ చేయటమే ప్రమాదాలకు కారణమని నిపుణులు తెలిపారు. ఇదే కూలీల పాలిట శాపంగా మారింది. కొత్తగా వచ్చిన ఏపీ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌-2020 ప్రకారం అక్టోబర్‌ 31 వరకూ అనుమతి తీసుకునేందుకు గడువు ఉంది. అప్పటికీ అనుమతి తీసుకోకపోతే నోటీసులు ఇస్తామని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు రాఘవరెడ్డి తెలిపారు.

రొయ్యల సాగుకు ఎకరాకు సగటున 3 నుంచి 5 లక్షల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. బెయిలీ ఆక్వా ఫామ్‌ ఆధ్వర్యంలో సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నందున పెట్టుబడులకు కోట్లాది రూపాయలు అవసరం. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధితో పాటు మరికొందరు నేతలు ఆర్థికంగా సాయం అందించినట్లు సమాచారం. అందుకే అనుమతులు లేకపోయినా అన్నీ చక్కబెట్టుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

ఆ కరెంటే అక్కడి ఇళ్లకు..

రొయ్యల చెరువుల యజమాని బెయిలీ కుటుంబసభ్యులు పేర్లు, కొందరు అసైనీల పేరుతో ఆక్వాసాగు కోసం 22 విద్యుత్తు కనెక్షన్లు తీసుకున్నారు. రాయితీతో ప్రభుత్వం అందిస్తున్న ఆ విద్యుత్తును అక్కడి ఇళ్లకు, ఇతర షెడ్లకూ వాడుతున్నారు. ఇది గుర్తించిన విద్యుత్తు శాఖ అధికారులు గృహవిద్యుత్తుకు వేరే కనెక్షన్‌ తీసుకోవాలని కొన్నిరోజుల కిందటే నోటీసులు జారీ చేశారు. ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలను కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఒడిశా ఎమ్మెల్యే రఘునాథ్‌ గొమాంగో పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా ప్రభుత్వాలు ప్రకటించిన పరిహారం చెక్కులను అందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు.

తీరప్రాంతంలో సుమారు 4 వేల ఎకరాల్లో అనుమతి లేకుండానే రొయ్యల చెరువులు సాగుచేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం ఘటనలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వాటిపై దృష్టిసారించింది.

ABOUT THE AUTHOR

...view details