ఓ స్కూల్ హెడ్మాస్టారు ఈ మధ్యే రిటైర్ అయ్యాడు. అతనికి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులు అన్ని అతనికి తెలియకుండానే సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. అసలేం జరిగిందంటే..?
'30ఏళ్ల కష్టం.. 30నిమిషాల్లో దోచేశారు' - Telangana News Updates
ఆన్‌లైన్‌లో అమాయకులను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. వినియోగదారుని ప్రమేయం లేనిదే... లావాదేవీలు జరగకుండా బ్యాంకులు పెట్టిన రక్షణ వలయాలను సైతం ఛేదిస్తూ... చోరీ చేస్తున్నారు. తాజాగా సైబర్ కేటుగాళ్లు... కస్టమర్ నంబర్లను గూగుల్‌లో పెట్టి మోసం చేస్తున్నారు.
ఇంట్లో ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదని... కస్టమర్ సర్వీస్‌కు ఫోన్ చేద్దామని గూగుల్‌లో నంబర్ వెతికి తీసుకున్నాడు. కానీ అది సైబర్ నేరగాళ్ల నంబర్. ఆ నంబర్‌కు ఫోన్ చేసి నెట్ సరిగ్గా రావడం లేదని సమస్య తెలిపాడు. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు... మీ సమస్య అర్థం కావడం లేదు.. మీ కంప్యూటర్లో రిమోట్ డెస్క్‌టాప్ ఇన్స్టాల్ చేయండి అంటూ సలహా ఇచ్చాడు. అది తెలియని అతను... ఇన్స్టాల్ చేసి.. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చాడు. ఒక అరగంట తర్వాత చూస్తే.. అతని రిటైర్మెంట్ డబ్బులు అన్ని మటుమాయమయ్యాయి. 30 సంవత్సరాల అతని కష్టం 30 నిమిషాల్లో దోచేశారు.
చూశారుగా... మీరూ తస్మాత్ జాగ్రత్త... తొందరపడి మీ సమాచారాన్ని ఎవరికి ఇవ్వకూడదు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండండి. గూగుల్‌లో వచ్చే సమాచార అంతా సరైనది కాకపోవచ్చు. సంబంధిత అధికారిక వెబ్సైట్లోనే నంబర్లను తీసుకోవాలి.