Life imprisonment for former AIMIM leader: ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం మాజీ అధ్యక్షుడు ఫారుఖ్‌కు జీవితఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 2019 డిసెంబర్ 18న జమీర్‌పై కాల్పుల ఘటనలో ఫారూఖ్ అహ్మద్‌కు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరిచింది. పిల్లల క్రికెట్ వివాదం తీవ్ర ఘర్షణలకు దారి తీయడంతో ఫారూఖ్ కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ అదే ఏడాది డిసెంబర్ 26న మృతి చెందాడు. తన కుమారుడిని తిట్టాడని జమీర్ అనే వ్యక్తిపై ఫారూఖ్ కాల్పులు జరిపాడు. ఈ కేసులో ఏ-2, ఏ-3లుగా ఉన్న ఫిరోజ్ ఖాన్, మహ్మద్ అర్షాద్‌లను కోర్టు నిర్దోషులుగా తేల్చిచెప్పింది. ఫారూఖ్‌కు జీవితఖైదు తోపాటు.. 12 వేల రూపాయల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది.
అసలేం జరిగిందంటే..
Life imprisonment for Farooq Ahmed : ఆదిలాబాద్‌లోని తాటిగూడ కాలనీలో 2020 డిసెంబర్ 18న పిల్లల క్రికెట్ ఆటలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. తన కుమారుడిని మందలించారనే అక్కసుతో ఫారూఖ్ అహ్మద్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పురపాలక మాజీ కౌన్సిలర్ సయ్యద్ జమీర్ తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ అదే నెల 26న జమీర్ మృతి చెందాడు. కాల్పుల్లో స్వల్పంగా గాయపడిన అన్నన్, మోతేసీన్ అనే మరో ఇద్దరికి ప్రాణాపాయం తప్పింది.
ఫారూఖ్‌కు జీవితఖైదు..
కేసు దర్యాప్తు చేసిన పోలీసుల విజ్తప్తి మేరకు హైకోర్టు.. గతేడాది మార్చి 19న జిల్లా సెషన్స్ కోర్టునే ప్రత్యేక కోర్టుగా నియమించింది. విచారణ ప్రారంభం కంటే ముందే గతేడాది జిల్లా జైలులోనే ఫారూఖ్ అహ్మద్ ఆత్మహత్యకు యత్నించాడు. ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక గత సెప్టెంబర్ 21న షెడ్యూల్‌ను ప్రకటించిన ప్రత్యేక కోర్టు.. 24 మంది సాక్ష్యాలను స్వీకరించింది. ఈ ఏడాది జనవరి 6వ తేదీవరకు వాదప్రతివాదాలను ఆలకించిన కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఫారూఖ్ అహ్మద్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.12వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు పట్ల ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి హర్షం ప్రకటించగా, కోర్టు ముందు అంతా సమానులేనని ప్రత్యేక పీపీ రమణారెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత కథనాలు :
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!