తెలంగాణ

telangana

ETV Bharat / crime

FAKE POWER BILLS: ' అదంతా అబద్ధం... అలా విద్యుత్ సరఫరా నిలిపివేయం' - కరెంటు బిల్లులు

ఒక్కోసారి అదనపు కరెంటు బిల్లులు సామాన్యులకు హార్ట్​ఎటాక్​లు రప్పిస్తుంటే... ఇప్పుడు మోసపూరిత మెసేజ్​లు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. విద్యుత్ నిలిపివేస్తామని... బిల్లుల చెల్లింపు పేరుతో వినియోగదారుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారు.

FAKE POWER BILLS
కరెంటు బిల్లులు

By

Published : Sep 24, 2021, 12:47 PM IST

విద్యుత్ బకాయిలు చెల్లించని వారిని గుర్తించి కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండటం వల్ల ఈ రోజు రాత్రి 10.30 తరవాత విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని సందేశాలు పంపిస్తున్నారు. అలా విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా ఉండేందుకు, బిల్లుల చెల్లింపు కోసం విద్యుత్ అధికారి (9692848762)కి కాల్ చేయండి అంటూ వినియోగదారులకు మోసపూరిత మెసేజ్​లు పంపిస్తున్నారు.

మోసపూరిత సందేశాలు

ఈ విషయం ఎస్పీడీసీఎల్ దృష్టికి వచ్చింది. దీంతో ఎస్పీడీసీఎల్ సీఎండీ... వినియోగదారులను అప్రమత్తం చేశారు. గతంలో కూడా విద్యుత్ వాడకం బిల్లుల చెల్లింపు పేరుతో కొంత మంది వ్యక్తులు వినియోగదారులను మెసేజ్​ల ద్వారా, ఫోన్​ల ద్వారా సంప్రదించి విద్యుత్ బిల్లులు పెండింగ్​లో ఉన్నాయనే సందేశాలు వచ్చేవని వెల్లడించారు. అలా వినియోగదారులను బెదిరించి వారి బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు వివరాలు తీసుకుని వారి అకౌంట్ల నుంచి నగదును విత్ డ్రా చేసుకుని మోసం చేసిన ఘటనలు కూడా తమ దృష్టికి వచ్చాయని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.

విద్యుత్ వినియోగదారులు ఇలాంటి మోసపూరిత సందేశాలు, కాల్స్​ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. ఒక వేళ ఎవరైనా వ్యక్తులు తమకు ఫోన్ చేసినా, మెసేజ్ ద్వారా గాని విద్యుత్ బిల్లు పెండింగ్​లో ఉందని పేర్కొంటే... సంస్థ వెబ్ సైట్ www.tssouthernpower.com, TSSPDCL మొబైల్ యాప్​లో సరి చూసుకోవాలని సూచించారు. రాత్రిపూట, అర్ధరాత్రి పూట విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి చర్యలను విద్యుత్ సంస్థ చేయదని సీఎండీ పేర్కొన్నారు. అలాంటి మెసేజ్​లు కానీ, ఫోన్​లు కానీ వస్తే.. వెంటనే పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details