SP Reaction on Bairi Naresh Case : మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే చట్టపరంగా శిక్షిస్తామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. అయ్యప్ప స్వామిని కించపరుస్తూ మాట్లాడిన బైరి నరేశ్‌పై పీడీ చట్టం నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. బైరి నరేశ్‌పై గతంలోనూ కేసులున్నట్లు తెలిసిందని, దానికి సంబంధించిన వివరాలను సైతం సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.
బైరి నరేశ్‌పై పీడీ చట్టం నమోదుకు చర్యలు తీసుకుంటున్నాం: ఎస్పీ కోటిరెడ్డి - SP reactionnatreshCASE
SP reaction on Naresh case of religious hatred: ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్న బైరి నరేష్ కేసుపై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ఎవ్వరినైనా చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే శిక్ష తప్పదు
"మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే శిక్షిస్తాం. అదే విధంగా ఈరోజు ఉదయం నరేశ్‌ను అరెస్టు చేశాం. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. కోర్టు ముందు హాజరుపరచి నరేశ్‌కు శిక్ష పడేలా చేస్తాం."-కోటిరెడ్డి, వికారాబాద్ ఎస్పీ
ఇవీ చదవండి: