తెలంగాణ

telangana

ETV Bharat / crime

శంషాబాద్​లో తెల్లవారుజామున ఎస్​ఓటీ సోదాలు.. అసలేం జరిగిందంటే - ఫామ్​హౌస్ దాడి

SOT team Raids In Shamshabad: శంషాబాద్​ నగరు శివారులో మైలా​ర్​దేవరపల్లి పీఎస్​కు చెందిన బాబా ఖాన్​ అనే రౌడీ షీటర్​పై రౌడీ షీట్​ ఎత్తివేయడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ ఆనందాన్ని పార్టీ చేసుకుని స్నేహితులతో ఆనందంగా గడపాలని చూశాడు. కానీ..

శంషాబాద్​లో తెల్లవారుజామున ఎస్​ఓటీ  సోదాలు
శంషాబాద్​లో తెల్లవారుజామున ఎస్​ఓటీ సోదాలు

By

Published : Nov 6, 2022, 10:25 PM IST

SOT team Raids In Shamshabad: అసలేమైందంటే.. మైలా​ర్​దేవరపల్లి పీఎస్​కు చెందిన బాబా ఖాన్​ అనే రౌడీ షీటర్​పై రౌడీ షీట్​ ఎత్తివేయడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ ఆనందాన్ని పార్టీ చేసుకుని స్నేహితులతో ఆనందంగా గడపాలని చూశాడు. కానీ.. తెల్లవారుజామున నర్కుడ గ్రామ శివార్లలో ఉన్న సలీమ్​ ఫామ్​హౌస్​పై పోలీసులు దాడి జరపడంతో అతని ఆనందానికి అడ్డుకట్ట వేసినట్లయింది.

శంషాబాద్​లో తెల్లవారుజామున ఎస్​ఓటీ సోదాలు

పార్టీకి తన స్నేహితులైన నలుగురు యాసీస్​, అజర్​, సోహైల్​ మహబూబ్​లను ఆహ్వానించాడు. వాళ్లూ పాత రౌడీ షీటర్లు కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని శంషాబాద్​ పీఎస్​కు అప్పగించారు. పార్టీలో పోలీసులు 48 మంది వ్యక్తులను, నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 4 కత్తులు, 5హూట్కా కుండలు 9సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్​లో తెల్లవారుజామున ఎస్​ఓటీ సోదాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details