నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తోన్న ఓ దుకాణంపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రూ. లక్షా 75 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేటలో ఇది జరిగింది.
రూ. లక్షా 75 వేల విలువైన గుట్కా పట్టివేత - Gutka seized
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం షారాజీపేటలోని ఓ కిరాణంలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు.
Gutka confiscated
నిందితుడు విజయ్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనర్ ఆదేశాలతో.. వరుస దాడులు జరుపుతున్నట్లు వివరించారు. అక్రమ విక్రయాలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఫైనాన్షియర్ దారుణ హత్య