తెలంగాణ

telangana

ETV Bharat / crime

IPL betting gang arrested: ఐపీఎల్‌ బెట్టింగ్ ముఠా అరెస్టు... రూ.93లక్షలు సీజ్​ - తెలంగాణ నేర వార్తలు

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు(IPL betting gang arrested). పక్కా సమాచారంతో మియాపూర్‌, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌ పల్లి సహా 7 ప్రాంతాల్లో దాడులు చేసి 23 మంది బుకీలను పట్టుకున్నారు. వారి నుంచి 93 లక్షల నగదు సహా 2.2 కోట్ల విలువైన సొత్తును సీజ్‌ చేశారు.

IPL betting gang arrested
IPL betting gang arrested

By

Published : Sep 29, 2021, 2:52 PM IST

మొబైల్ యాప్స్‌తో క్రికెట్​ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠానా హైదరాబాద్​లో పోలీసులు అరెస్టు చేశారు (IPL betting gang arrested). బెట్టింగ్​కు పాల్పడుతున్న 23 మంది బుకీలను పట్టుకుని... వారి నుంచి రూ. 93లక్షల నగదు, 2.2కోట్లు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు(sot police ride on betting gang). పక్కా సమాచారంతో మియాపూర్‌, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌ పల్లి సహా 7 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

నిందితులపై గేమింగ్‌ యాక్ట్‌తో (gaming act)పాటు 7 కేసులు నమోదు చేశారు. బుకీలకు ముంబయి, గోవా, దుబాయ్‌లతో నెట్​వర్క్ ఉన్నట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. కరోనా వల్ల డిజిటలైజేషన్‌ పెరిగి... పిల్లలు ఫోన్‌లు ఎక్కువగా వాడుతున్నారని... యాప్‌ల ద్వారా సులభంగా బెట్టింగ్‌ చేస్తున్నారని వెల్లడించారు. విద్యార్థుల మొబైల్‌ యాప్‌లను తల్లిదండ్రులు పరిశీలించాలని సూచించారు.

ఐపీఎల్‌ బెట్టింగ్ ముఠా అరెస్టు... రూ.93లక్షలు సీజ్​

క్రికెట్​ బెట్టింగ్​ ప్రక్రియ నాలుగు లేయర్లుగా ఉంటుంది. మొదటి వరుసలో ప్రధాన బుకీ ఉంటాడు. రెండో వరుసలో సబ్​ బుకీ, మూడో వరుసలో బుకీలు ఇక నాలుగో వరుసలో బెట్టింగ్​లో పాల్గొనేవారు ఉంటారు. మేజర్​ బెట్టింగ్​ రాకెట్​ హైదరాబాద్​లో జరుగుతోంది. -స్టీఫెన్​ రవీంద్ర, సైబరాబాద్​ సీపీ.

ఇదీ చూడండి:IPL Betting: : ఐపీఎల్​లో 'వాట్సాప్' బెట్టింగ్.. ఎలా జరుగుతోంది? చివరికి ఏమవుతోంది?

ABOUT THE AUTHOR

...view details