Son Killed Mother: కన్నతల్లిపై ఓ కొడుకు కర్కశత్వం.. ఓ తల్లిని మృత్యు ఒడికి చేర్చింది. నవమాసాలు మోసి, జన్మనిచ్చిందనే కనికరం కూడా లేకుండా... మద్యం మత్తులో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి గొంతు నులిమి హతమార్చాడు. ఈ అమానుష ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బోధన్ మండలం ఏరాజ్పల్లి గ్రామానికి చెందిన మంజుల(40) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె కుమారుడు గంగా ప్రసాద్ (19) మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం మద్యం కోసం డబ్బులు ఇవ్వమని వేధించాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో కోపానికి గురైన ప్రసాద్ రాత్రి నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి హత్య చేశాడు.
Son Killed Mother: మద్యం డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు.! - మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపిన కుమారుడు
Son Killed Mother: కని, పెంచి, పెద్దచేసిన తల్లిని... కర్కశంగా ప్రాణాలు తీశాడో కుమారుడు. నవమాసాలు మోసి సాధిన కొడుకే తన పాలిట యముడవుతాడని ఆ తల్లి ఊహించలేకపోయింది. కన్నతల్లి అనే కనికరం లేకుండా మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని... తాగిన మత్తులో నిద్రిస్తున్న సమయంలో విచక్షణారహితంగా ఆమె గొంతు నులిమి హతమార్చాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
Son Killed Mother
అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న క్రమంలో: బంధువులు తొలుత సాధారణ మరణంగా భావించారు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న క్రమంలో మంజుల ముక్కు, నోట్లో నుంచి రక్తం వస్తుండడంతో కొడుకును నిలదీయగా అసలు విషయం బయటపడింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు గంగాప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.