తెలంగాణ

telangana

ETV Bharat / crime

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కుమారుడు - నిజామాబాద్ జిల్లా తాజా నేర వార్తలు

మద్యం మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. డబ్బుల కోసం తన తల్లితో వాగ్వాదానికి దిగి అనంతరం ఆమెను హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

SON MURDERED HIS MOTHER
తల్లిని చంపిన కుమారుడు

By

Published : Apr 5, 2022, 4:49 PM IST

నిజామాబాద్ జిల్లా తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన గంగేశ్వర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి మద్యానికి డబ్బుల కోసం తల్లి అంజమ్మను రోజు హింసించేవాడు.

సోమవారం రాత్రి మద్యం తాగి తల్లి అంజమ్మతో డబ్బులు ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు. ఆగ్రహంతో పక్కనే ఉన్న రొట్టెల కర్రతో తల్లి తలపై బలంగా కొట్టాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి మేనల్లుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details