మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్న తండ్రినే (Son kills Father) కడతేర్చాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని కోపంతో తండ్రి ఒంటిపై నూనె పోసి నిప్పు పెట్టాడు. కాలిన గాయాలతో తండ్రి కేకలు వేయడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి ప్రాంతంలోని ఇంద్రానగర్‌లో ఉండే కోటిపల్లి దుర్గారావు(55) ఓ ప్రైవేటు బ్యాంకు ప్రాంగణంలో గార్డెనింగ్ పనిచేస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మి, నాగబాబు(35), సూరిబాబు(33) ఇద్దరు కుమారులున్నారు. సూరిబాబు కుటుంబంతో బోరబండలో ఉంటున్నాడు. వివాహం కాని నాగబాబు మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు.
Son kills Father: కన్నతండ్రిని చంపిన కొడుకు... కారణం అదేనా..? - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన తనయుడే తండ్రి పాలిట(Son kills Father) యముడయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదనే కోపంతో తండ్రి ఒంటిపై వంట నూనె పోసి నిప్పు పెట్టాడు. ఇంట్లో నుంచి పొగ రావడంతో చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దుర్గారావు ఆరోగ్యపరిస్థితి బాగాలేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. అతని భార్య కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నాగబాబు నిత్యం మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. మంగళవారం రోజు కల్లు తాగి వచ్చిన నాగబాబు.. తండ్రితో గొడవపడ్డాడు. మద్యానికి డబ్బులి వ్వాలంటూ వేధించాడు. డబ్బుల్లేవని చెప్పినా.. వినలేదు. కోపంతో తండ్రిపై వంటనూనె పోసి(Son kills Father) నిప్పుపెట్టాడు. ఇంటికి గడియపెట్టి పారిపోయాడు. దుర్గారావు కేకలు విని స్థానికులు వచ్చి ఉస్మానియాకి తరలించగా బుధవారం రోజు మృతిచెందాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని గచ్చిబౌలి ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. అతని మానసిక స్థితి సక్రమంగా లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:STUDENT SUICIDE: తమ్ముడికి మెసేజ్ పెట్టి అన్న బలవన్మరణం