తెలంగాణ

telangana

ETV Bharat / crime

Father killed son : దారుణం... కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి.. - telangana news

Father killed son: వ్యసనాలకు దూరంగా ఉండాలని బిడ్డకు చెప్పాల్సిన తండ్రే.. తాగి వచ్చి కుమారుడితో తగువు పెట్టుకున్నాడు. విచక్షణ మరిచి రోకలిబండతో బాదాడు. అంతేకాకండా కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది.

Father killed son, father murder son
కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి..

By

Published : Mar 5, 2022, 10:07 AM IST

Father killed son: మమకారం పంచిన ఆ చేతులే మద్యం మత్తులో విచక్షణరహితంగా కన్నబిడ్డను కడతేర్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని ఇందిరాకాలనీలో ఈ ఘటన జరిగింది. రాచూరి హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులు రోజువారి కూలి పనులు చేసుకుంటూ ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్నారు. హుస్సేన్​కి వీరాంజనేయులు(24)అనే ఒక్కగానొక్క కుమారుడు. ఇటీవలే ఆ కుమారునికి వివాహం కూడా చేశారు. తండ్రీకొడుకు... తరచూ మద్యం సేవించి గొడవ పడేవారు. దీంతో వీరాంజనేయులు వివాహం జరిగినప్పటి నుంచి అతడి భార్య పుట్టింట్లోనే ఉంటుంది.

శుక్రవారం రాత్రి హుస్సేన్ పూటుగా మద్యం సేవించి వీరాంజనేయులుతో తగువు పెట్టుకున్నాడు. విచక్షణ మరిచి రోకలిబండతో బాదాడు. అంతేకాకండా కత్తితో పొడిచి అతి కిరాతకంగా చంపాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పాపారావు తెలిపారు

ఇదీ చదవండి:'పెళ్లి చేసుకుంటా.. అమెరికా తీసుకెళ్తా..' అంటూ యువతులకు వల

ABOUT THE AUTHOR

...view details