నగల కోసం తల్లినే చంపాడో కిరాతకుడు. ఈ ఘటన హైదరాబాద్, చింతల్లో చోటుచేసుకుంది. భగత్ సింగ్ నగర్‌కు చెందిన హరి(24).. రెండేళ్ల క్రితం తాను చేస్తోన్న ఉద్యోగం మానేశాడు. నిత్యం ఉద్యోగానికి వెళ్తున్నానని నమ్మించి.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సాయంకాలానికి తిరిగొచ్చేవాడు. రోజూ లాగే బయటకు వెళ్లిన హరి.. కాసేపటికి తిరిగొచ్చి టవల్‌తో తల్లి స్వరూప(48)ను హతమార్చాడు. ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు.
తల్లిని హతమార్చి.. నగలతో పరార్ - తల్లిని చంపిన కొడుకు
నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లినే గొంతు నులుమి హత్య చేశాడో కొడుకు. హత్య.. దొంగల పనేనని నమ్మించబోయి.. పోలీసులకు చిక్కిపోయాడు. హైదరాబాద్ చింతల్లో జరిగిందీ ఘటన.
![తల్లిని హతమార్చి.. నగలతో పరార్ son killed the mother](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:06:55:1620787015-tg-hyd-13-12-son-murder-by-mother-for-gold-av-ts10011-12052021070147-1205f-1620783107-357.jpg)
son killed the mother
రాత్రి ఇంటికి వచ్చిన హరి తండ్రి మల్లేశ్.. విగత జీవిగా పడి ఉన్న భార్యను చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. కుమారుడికి సమచారమివ్వగా.. ఇంటికి వచ్చిన నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా జరిగిన హత్య… దొంగల పనేనని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు.. సీసీ టీవీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు హరిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:హిడ్మా ఆదేశాలతోనే పేలుడు పదార్థాల రవాణా