తెలంగాణ

telangana

ETV Bharat / crime

తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని.. మారు తండ్రిని హతమార్చిన 13 ఏళ్ల కుర్రాడు.. - jangon murder

Son Killed step Father: ఆ కుర్రాడికి పదమూడేళ్లు. తండ్రి చనిపోయాడు. తల్లి ఇంకో వివాహం చేసుకుంది. తల్లి, మారు తండ్రితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో.. మారు తండ్రి రోజూ తాగి రావటం.. తన తల్లిని ఇష్టమున్నట్లు కొట్టేవాడు. తల్లి బాధపడటం చూసి గుండె రగిలిపోయిన ఆ కుర్రాడు.. ఆ మారు తండ్రి నుంచి బాధ విముక్తిరాలిని చేశాడు.

son killed step father for beating his mother daily in janagama
son killed step father for beating his mother daily in janagama

By

Published : Apr 13, 2022, 10:12 AM IST

Updated : Apr 13, 2022, 4:25 PM IST

Son Killed step Father: పీకలదాకా తాగి రావటం.. మద్యం మత్తులో భార్యను కొట్టటం.. ఇదే తంతు. రోజూ తన తల్లిని చిత్రహింసలు పెడుతున్న మారు తండ్రిని చూస్తూంటే.. పదమూడేళ్ల కుర్రాడికి రక్తం మరిగిపోయింది. ఒకరోజు కాకపోయిన ఒకరోజైనా మారతాడేమో అని ఎదురుచూశాడు. కానీ.. రోజూ తన తల్లి కార్చే కన్నీళ్లు అతడిలో కోపాన్ని రెంట్టింపు చేశాయి. ఆ కష్టాల నుంచి తల్లికి విముక్తి కల్పించాలనుకున్నాడు. ఏం ఆలోచించకుండా.. తండ్రిని హతమార్చాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​నగర్​లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ పార్శీగుట్టకు చెందిన హనుమండ్ల వినోద్(34) భార్య చనిపోయింది. జనగామ పట్టణానికి చెందిన మంజుల మొదటి భర్త చనిపోవటంతో.. వినోద్​ను రెండో వివాహం చేసుకుంది. వివాహం జరిగే సమయానికే మంజులకు కొడుకు ఉన్నాడు. వినోద్​.. వరంగల్​ కాశీబుగ్గలోని ఓ నీటి శుద్ధిప్లాంట్​ కంపెనీలో టెక్నీషియన్​గా పనిచేస్తూ.. మంజుల, ఆమె కుమారుడితో కలిసి జనగామలోని అంబేడ్కర్​నగర్​లో వినోద్​ నివాసముంటున్నాడు. రోజూ తాగొచ్చి గొడవ చేయటంతో.. భార్యభర్తల మధ్య మనస్పర్దలు రావటం వల్ల మంజుల.. అదే పట్టణంలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో మంగళవారం(ఏప్రిల్​ 12న) అత్తగారింటికి వచ్చి గొడవ చేశాడు. అది కాస్తా.. ముదిరి దాడి చేసేదాకా వెళ్లింది.

తన కళ్ల ముందే మళ్లీ తల్లిని కొడుతుంటే తట్టుకోలేకపోయాడు ఆ కుమారుడు. మారు తండ్రి అయిన వినోద్​ను.. అబ్బాయి తల్లి, తాత గట్టిగా పట్టుకున్నారు. వెంటనే కళ్లల్లో కారం కొట్టి.. కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వినోద్​.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి 10.30 గంటలకు చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న జనగామ ఏసీపీ గజ్జి కృష్ణ, పట్టణ సీఐ ఎల్లబోయిన శ్రీనివాస్‌, ఎస్సై మహేందర్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎల్లబోయిన శ్రీనివాస్‌ తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 13, 2022, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details