తెలంగాణ

telangana

ETV Bharat / crime

son killed mother for property: ఆస్తి కోసం కన్నతల్లిని కొట్టి చంపాడు..! - ఆస్తి కోసం తల్లి హత్య

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్​లో దారుణం జరిగింది. ఆస్తి తనపేరుపై రాయడం లేదని.. కన్న తల్లికి కిరాతకంగా హత్య చేశాడో కుమారుడు (son killed mother for property). మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

son killed mother for property
son killed mother for property

By

Published : Oct 28, 2021, 4:57 PM IST

నిజామాబాద్​ జిల్లా చందూర్​ మండలం లక్ష్మాపూర్​కు చెందిన సాయమ్మ(60)కు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సాయమ్మ పేరుపై ఉన్న నాలుగెకరాల భూమిని తన పేరుపై రాయాలని ఆమె కుమారుడు నారాయణ కొంత కాలంగా తల్లితో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో భూమి విషయమై బుధవారం రాత్రి కూడా తల్లితో గొడవపడ్డాడు నారాయణ.

బుధవారం రాత్రి సాయమ్మ నిద్రపోతున్న సమయంలో ఆమె గొంతు పిసికి, గోడకేసి కొట్టి హత్య చేశాడని... మృతురాలి పెద్ద కుమార్తె శోభ... పోలీసులకు ఫిర్యాదు చేసింది (son killed mother for property). రక్తం మరకలు కనిపించకుండా చేసి సాధారణ మృతిగా నమ్మించేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు

"లక్ష్మాపూర్​ గ్రామానికి చెందిన నారాయణ.. తన తల్లిపేరుపై ఉన్న ఆస్తిని తన పేరుపై మార్చాలంటూ బుధవారం రాత్రి తల్లితో గొడవపడ్డాడు. ఆ గొడవలోనే తల్లిని డోర్​కేసి కొట్టి.. గొంతు పిసికి చంపాడు. ఆ తర్వాత ఎటువంటి అనుమానం రాకుండా రక్తం ఆనవాళ్లు లేకుండా చేసి.. సాధారణ మృతిగా నమ్మించేందుకు ప్రయత్నించాడని మృతురాలి పెద్ద కుమార్తె శోభ ఫిర్యాదు చేసింది (son killed mother for property). ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని" పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:Tragedy : ఒకే వీధిలో ముగ్గురు యువతులు అదృశ్యం.. చెరువులో మృతదేహాలు

ABOUT THE AUTHOR

...view details