తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిద్రిస్తున్న తల్లిపై కొడుకు కర్కశత్వం.. కర్రతో దాడి చేసి.. - telangana crime news

Son Killed Mother: మద్యానికి బానిసైన ఓ కొడుకు కర్కశత్వం.. కన్న తల్లిని బలితీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి ఆమె చావుకు కారణమయ్యాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

son killed mother
తల్లిని చంపిన కొడుకు

By

Published : Mar 12, 2022, 7:20 PM IST

Son Killed Mother: కన్నతల్లిపై ఓ కొడుకు కర్కశత్వం.. ఆమెను మృత్యు ఒడికి చేర్చింది. నవమాసాలు మోసి, జన్మనిచ్చిందనే కనికరం కూడా లేకుండా కర్రతో తీవ్రంగా కొట్టాడు. వృద్ధాప్యంలో తల్లికి ఆసరాగా ఉండాల్సింది పోయి.. మద్యం మత్తులో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. ఈ అమానుష ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్​ పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

ఇంట్లో నిద్రిస్తున్న తల్లి కళావతిపై శివకుమార్​ కర్రతో తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో కళావతి తీవ్రంగా గాయపడింది. రక్తమోడుతున్న వృద్ధురాలిని గుర్తించిన స్థానికులు 108 వాహనంలో నిజామాబాద్​లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది.

మద్యానికి బానిసై

శివకుమార్​ తరచూ మద్యం సేవించి తల్లి, భార్యతో గొడవపడే వాడని స్థానికులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో అతని భార్య కూడా ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. సమాచారం అందుకున్న జక్రాన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శివకుమార్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:Woman's Suspicious Death : తల్లి చనిపోయిందని తెలియక.. 4 రోజులుగా స్కూలుకెళ్లొస్తూ..

ABOUT THE AUTHOR

...view details