తల్లి హత్యను జీర్ణించుకోలేకపోయిన ఓ వ్యక్తి.. కన్న తండ్రిని కత్తితో పొడిచి చంపి పగ తీర్చుకున్నాడు. ఈ ఘటన నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలో చోటుచేసుకుంది. గుర్లపల్లి గ్రామానికి చెందిన చెన్నప్ప(50).. అనుమానంతో మూడేళ్ల క్రితం తన భార్యను చంపేశాడు. మృతురాలి పెద్ద కుమారుడు రాములు(25).. అప్పటి నుంచి తండ్రిపై పగ పెంచుకున్నాడు.
Revenge murder: తండ్రిని చంపిన తనయుడు
నారాయణ పేట జిల్లా మక్తల్లో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రిని.. కుమారుడే హత్య చేశాడు. పాత పగలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది.
Murder
పథకం ప్రకారం.. రాములు బుధవారం సాయంత్రం పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న చెన్నప్పను కత్తితో కసి తీరా పొడిచాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రీ కొడుకుల మధ్య ఇటీవలే ఆస్తికి సంబంధించిన గొడవలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: Murder Attempt: డబ్బుల కోసం వ్యక్తిపై కత్తితో దాడి