తెలంగాణ

telangana

ETV Bharat / crime

తండ్రి ప్రాణాలను బలితీసుకున్న గొడవ - అనంతసాగరంలో తండ్రిని చంపిన కొడుకు

పొలం పనుల విషయంలో తండ్రి, కుమారుడి మధ్య జరిగిన వివాదం.. తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. ఆవేశంతో కుమారుడు.. కత్తి పీటతో తండ్రిపై దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగింది.

ap crime news, son killed father
తండ్రి ప్రాణాలను బలితీసుకున్న గొడవ

By

Published : May 1, 2021, 11:12 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరులో దారుణం జరిగింది. పొలం పనుల విషయంలో తండ్రి, కుమారుడి మధ్య గొడవ.. తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. రేవూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య మద్యం మత్తులో పొలం చదును చేసే విషయంలో కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు.

ఈ క్రమంలో తనయుడు ప్రవీణ్ తండ్రితో ఘర్షణకు దిగాడు. ఆవేశంగా కత్తిపీటతో తండ్రిపై దాడి చేసి గాయపరిచాడు. సుబ్బయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: ఏటీఎం కేంద్రంలో శానిటైజర్​ స్వాహా

ABOUT THE AUTHOR

...view details