తెలంగాణ

telangana

ETV Bharat / crime

Murder: క్షణికావేశంలో మామను చంపిన అల్లుడు - క్షణికావేశంలో మామను చంపిన అల్లడు

Son in Law Killed his Father in Law: కుటుంబ తగాదా విషయాలు చర్చించేందుకు వెళ్లిన మామను.. అల్లుడు హత్య చేసిన ఘటన జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Son in Law Killed his Father in Law
మామను చంపిన అల్లుడు

By

Published : Dec 29, 2021, 10:51 AM IST

Son in Law Killed his Father in Law: మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో మామ హత్య చేశాడో అల్లుడు. సంజయ గాంధీనగర్​కు చెందిన రాజమౌళి మంగళవారం రాత్రి పాపిరెడ్డి నగర్​లోని తన అల్లుడు బాలకృష్ణ ఇంటికి వెళ్లాడు. బాలకృష్ణ తండ్రి వివాహేతర సంబంధం విషయమై చర్చించుకున్నారు. అక్కడ మాటమాట పెరిగి గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన బాలకృష్ణ తన మామ రాజమౌళి మెడపై కత్తితో పొడిచాడు.

మృతుడు రాజమౌళి

అప్రమత్తమైన కుటుంబసభ్యులు రాజమౌళిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి:Constable Rape Attempt on Girl : కాపాడాల్సిన పోలీసే.. కాటేయబోయాడు!

ABOUT THE AUTHOR

...view details