తెలంగాణ

telangana

ETV Bharat / crime

అత్తను నరికి చంపిన అల్లుడు.. కుటుంబ కలహాలే కారణమా.? - కాకినాడ జిల్లా నేర వార్తలు

Murder: ఏపీలోని పిఠాపురం విద్యుత్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. అత్తను అల్లుడు కత్తితో నరికి హత్య చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన మామ, బావమరిదిపైనా దాడి చేశాడు.

son in law murdered mother in law
అత్తను నరికి చంపిన అల్లుడు

By

Published : May 18, 2022, 12:59 PM IST

Murder: ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ జిల్లా పిఠాపురం విద్యుత్ నగర్‌లో సొంత అల్లుడి చేతిలో మహిళ దారుణ హత్యకు గురైంది. గండేపల్లి రమణమ్మ(46) అనే మహిళను అల్లుడు రమేష్​ కత్తితో నరికి హతమార్చాడు. అడ్డువచ్చిన మామ సత్యనారాయణ, బావమరిది దిలీప్​పైన కూడా కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details