తండ్రీకొడుకు మధ్య స్వల్ప ఘర్షణలో మనస్తాపానికి గురైన కుమారుడు క్షణికావేశంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చాపగాని తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన గూగులోతు శ్రీకాంత్(25) బీటెక్ చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఖాళీగా ఉండలేక ట్రాలీ నడుపుతూ ఆర్థికంగా తండ్రికి ఆసరాగా ఉంటున్నాడు. ఇటీవలే అతనికి పెళ్లి నిశ్చయమైంది. త్వరలోనే ముహూర్తం ఖరారు చేసి వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించారు.
తండ్రి మందలించాడని ఉరివేసుకొని కుమారుడు ఆత్మహత్య - suicide news in siddipet district
మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొని నూతన జీవితాన్ని ప్రారంభించాల్సిన యువకుడు.. క్షణికావేశ నిర్ణయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మందలించాడనే కోపంతో చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవిగా మారిపోయాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. సిద్దిపేట జిల్లా చాపగాని తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి కుటుంబ ఆర్థిక సమస్యలపై తండ్రి మంజ్యనాయక్, శ్రీకాంత్‌ల మధ్య గొడవ జరిగింది. ఉద్యోగ విషయమై తండ్రి గట్టిగా మందలించడంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్.. సమీపంలోని వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతికి అందివచ్చిన కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:140 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత