తెలంగాణ

telangana

ETV Bharat / crime

తండ్రి మందలించాడని.. ఆ కొడుకు ఏం చేశాడంటే? - North Rajupalem latest news

viral news: చాలా మంది యువత.. ఇంట్లో తల్లిదండ్రులు మందలించారనో లేకపోతే కొట్టారనో కారణంతో ప్రాణాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా ఓ తండ్రి అలానే కొడుకును మందలించాడు. అయితే ఆ యువకుడు కూడా ప్రాణాలు తీసుకున్నాడని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. తండ్రి తిడితే ఆ కొడుకు ఏం చేశాడో మీరు చదివేయండి..

viral news
viral news

By

Published : Dec 24, 2022, 2:39 PM IST

viral news: తమ పిల్లలు చెడు దారిలో వెళ్లకుండా మంచి అలవాట్లను అలవరచుకోవాలని తల్లిదండ్రులు నిత్యం తపిస్తుంటారు. అలానే వాళ్లు చేసే పనులు మంచిగా లేకపోతే మందలిస్తారు. కొద్దిమంది వారి మాటలు వింటే.. చాలా మంది వాళ్లు తిట్టడం నచ్చక మనస్తాపానికి గురై ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా ఓ తండ్రి అలానే కొడుకును మందలించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు.. తన సొంత బైక్​కు నిప్పంటించాడు.

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెంలో చోటుచేసుకుంది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్డుపై కేక్ కట్ చేయడం ఏమిటని కొడుకును తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహం చెందిన కుమారుడు తన బైక్​కు తానే నిప్పంటించాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా దగ్ధమైంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details