రాత్రి సమయంలో నిద్రలో ఉన్న తండ్రిపై అతని కుమారుడే దాడి చేశాడు. కత్తిలో అత్యంత పాశవికంగా గొంతుకోసి హత్యచేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం కేకేతండాలో జరిగింది.
దారుణం: గొంతు కోసి తండ్రిని చంపిన కిరాతకుడు - తండ్రిని చంపిన తనయుడు
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం కేకేతండాలో దారుణం జరిగింది. రాత్రివేళ నిద్రలో ఉన్న తండ్రిని అతని కుమారుడే దారుణంగా హతమార్చాడు.
తండ్రిని చంపిన తనయుడు
కేకేతండాకు చెందిన ఆడోతు బాలు నాయక్ (45) గురువారం రాత్రి తన ఇంటి బయట నిద్రిస్తున్నాడు. కుమారుడు నవీన్ అతనిపై కత్తితో దాడి చేసి కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఉదయం స్థానికులు చూసేసరికి బాలు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:తల్లి పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదని ఓ కూతురి ఘాతుకం