తెలంగాణ

telangana

ETV Bharat / crime

తండ్రిని గడ్డపారతో కొట్టి చంపిన కొడుకు - Andevelli crime news

ఓ తండ్రి బంధువుల ఇంట్లో మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం కోసం బయటకు వెళ్లసాగాడు. గమనించిన కుమారుడు వద్దని వారించాడు. వారి మధ్య జరిగిన ఘర్షణలో కుమారుడు ఆవేశానికి లోనయ్యాడు. ఈ క్రమంలో కుమారుడు తండ్రిపై గడ్డపారతో బాదాడు. దీంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన కుమురం భీం జిల్లా జరిగింది.

son beat his father to death, komaram bheem district crime news
తండ్రిని గడ్డపారతో కొట్టి చంపిన కొడుకు

By

Published : Apr 30, 2021, 1:30 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ మండలం అందెవేల్లిలో విషాదం చోటుచేసుకుంది. కన్నతండ్రిని కుమారుడు గడ్డపారతో తలపై మోదీ చంపాడు. అందెవేల్లికి చెందిన పొలగాని రాగులయ్య(60)నిన్న రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి మద్యం సేవించి వచ్చాడు. మళ్లీ మద్యం సేవించేందుకు బయటకు వెళుతుండగా కుమారుడు బీరయ్య వద్దంటూ వారించాడు. తండ్రి కొడుకులిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ క్రమంలో ఆవేశానికి లోనైన కుమారుడు బీరయ్య గడ్డపారతో తండ్రి తలపై మోదాడు. తలకు బలమైన గాయం కావడం వల్ల రాగులయ్య కుప్పకులాడు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

ఇదీ చూడండి:ఏడేళ్ల కుమార్తెని చంపిన కసాయి తండ్రి

ABOUT THE AUTHOR

...view details