తెలంగాణ

telangana

ETV Bharat / crime

కన్నతల్లిపై పుత్రుడి కర్కశత్వం.. కొట్టి గోతిలో పడేసి..

Son Attack On Mother: ఒకప్పుడు తల్లిదండ్రులు కోప్పడినా.. కాస్త మందలించినా.. పిల్లలు బుంగమూతి పెట్టుకుని అలిగేవాళ్లు. కానీ కాలం మారింది. పిల్లల మనస్తత్వాలూ మారాయి. కొందరు సున్నితంగా ఉంటే.. మరికొందరు క్రూరంగా తయారవుతున్నారు. తాజాగా నవమాసాలు మోసి, కంటికి రెప్పలా పెంచిన కన్నతల్లిపైనే అమానుషంగా దాడి చేశాడో ఓ సుపుత్రుడు. అడ్డుకోబోయిన వారిని సైతం బెదిరించాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లాలో జరిగింది.

కన్నతల్లిపై పుత్రుడి కర్కశత్వం.. కొట్టి గోతిలో పడేసి...
కన్నతల్లిపై పుత్రుడి కర్కశత్వం.. కొట్టి గోతిలో పడేసి...

By

Published : Jul 15, 2022, 6:58 PM IST

Son Attack On Mother: ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం గుడిపాడులో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లిపై అమానుషంగా దాడి చేశాడు ఓ కుమారుడు. తనకు చెందిన స్థలంలో తల్లి అశ్రబీ మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టిందని ఆమె కుమారుడు ఈసూబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా తల్లిపై దాడి చేసి.. మరుగుదొడ్డి కోసం నిర్మాణం చేపట్టిన గుంతలో పడేశాడు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులను సైతం బెదిరించాడు. కుమారుడు ప్రవర్తనకు నిరసనగా.. అక్కడే అదే గుంతలో తల్లి అశ్రబీ నిరసనకు దిగింది. తన కుమారుడి నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details