తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆస్తి కోసం కొడుకు కర్కశత్వం.. తల్లిని కర్రతో కొడుతూ.. కాలితో తన్నుతూ - son brutally beats his mother in guntur

Son Attacked On Mother: కన్నతల్లి అని చూడకుండా అమానుషంగా దాడి చేశాడు ఓ కుమారుడు. ఆస్తి రాసివ్వాలంటూ చిత్ర హింసలకు గురి చేశాడు. అతడి తీరుతో వేదనకు గురై విలపిస్తున్న తల్లిని.. కనికరం లేకుండా కర్రతో చితకబాదాడు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్​లో రికార్డు చేసిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Son Attacked On Mother
తల్లిపై కుమారుడి దాడి

By

Published : Feb 19, 2022, 10:01 AM IST

కన్నతల్లిని కనికరం లేకుండా కొడుతున్న కుమారుడు

Son Attacked On Mother: నవమాసాలు మోసి, కంటికి రెప్పలా పెంచిన కన్నతల్లిపైనే అమానుషంగా దాడి చేశాడు ఓ కొడుకు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన శేషు.. వృద్ధాప్యంలో అమ్మ ఆలనాపాలనా చూసుకోవాల్సింది పోయి.. చిత్ర హింసలకు గురి చేశాడు. తల్లి పేరిట ఉన్న ఆస్తిని రాసివ్వాలంటూ.. భార్యతో కలిసి నిత్యం నరకం చూపించాడు. దెబ్బలకు తాళలేక విలపిస్తున్న తల్లిపై ఏ మాత్రం కనికరం చూపకుండా.. కర్రతో చితక బాదాడు.

స్థానికులు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్​లో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ కర్కశ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:అందంగా లేవని భర్త వేధింపులు.. ఉరేసుకుని భార్య బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details