హైదరాబాద్ సనత్‌నగర్ ఠాణా పరిధిలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. మద్యం మత్తులో కన్న తండ్రిపై కత్తితో దాడి చేశాడు. మద్యం తాగొద్దని మందలించాడనే కోపంతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సనత్‌నగర్ పరిధి ఫతేనగర్ డివిజన్ శివశంకర్‌నగర్‌కు చెందిన కిరణ్ (38) మద్యానికి బానిసయ్యాడు. కొంతకాలంగా ఏపనికి వెళ్లకుండా తిరుగుతున్నాడు. 12ఏళ్ల క్రితం వివాహమైన కిరణ్‌కు ఇద్దరు పిల్లలున్నారు. కిరణ్ తీరుతో విసుగుచెందిన అతని భార్య 2019లో విడిచిపెట్టి వెళ్లిపోయింది. అయినప్పటికీ అతని తీరులో మార్పురాలేదు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన కిరణ్‌ను అతడి తండ్రి అశోక్ మందలించాడు.