ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బొరిగం అటవీ ప్రాంతంలో కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. హరితహారం పేరిట ప్రభుత్వం మొక్కలు నాటేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. అటవిని కాపాడాల్సిన అధికారులు స్మగ్లర్లకు సహకారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జోరుగా కలప అక్రమ రవాణా.. అధికారుల నిర్లక్ష్యమే కారణం! - adilabad district latest news
అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు అక్రమార్కులు ఆదిలాబాద్ జిల్లాలోని అటవిని యథేచ్ఛగా నరికివేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరుతో ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తుంటే.. అటవీశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బొరిగం అటవిలో ఎటూ చూసినా భారీ కలప వృక్షాలు నేల కూలి కనిపిస్తున్నప్పటికీ... అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా అటవిని నాశనం చేస్తున్నారు. వృక్షాలను దుంగలుగా మార్చి రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫలితంగా ఏళ్లుగా పెరిగిన వృక్షాలు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు నేల కూలటంతో... ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఇంటి ఓనర్కు నిప్పంటించిన అద్దెదారు- చిన్నారి మృతి