Soil lorry rushed to the houses: వరంగల్ జిల్లా సంగెం కాపులకనపర్తి గ్రామంలో మట్టి లారీ బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినప్పుడు కరెంటు వైర్లు తెగిఉంటే భారీ అగ్ని ప్రమాదమే జరిగి ఆస్తి నష్టం వాటిల్లేదని స్థానికులు పేర్కొన్నారు. ఒకవేళ ఇళ్లలో మనుషులు ఉంటే జరిగే ఘోరం అంతా ఇంతా కాదు. ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద గండం నుంచి బయటపడినట్లైంది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. ఇళ్లపైకి దూసుకెళ్లిన మట్టి లారీ - soil lorry rushed to the houses
అనుమతుల్లేని మట్టి రవాణా... లారీల నిర్లక్ష్య వైఖరి.. వెరసి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో నల్లమట్టితో వెళ్తున్న లారీ.. అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడం.. ఆ తర్వాత ఇళ్లపైకి దూసుకెళ్లడం.. గ్రామస్థులకు ఆందోళన కలిగిస్తోంది. ఘటనలో కరెంటు వైర్లు తెగినా.. ఇళ్లలో మనుషులు ఉన్నా.. ఎంత ఘోరం జరిగి ఉండేదోనని ఆందోళన చెందారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇళ్లపైకి దూసుకెళ్లిన మట్టి లారీ
అనుమతులు లేని నల్లమట్టిని తరలిస్తూ ఇలా ప్రమాదాలకు కారణమవుతున్నట్లు స్థానికులు ఆరోపించారు. లారీల అతి ప్రవర్తన వల్ల నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. అక్రమ మట్టి రవాణాకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమైన వారి పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:యాదాద్రీశుని దర్శనాలు పున:ప్రారంభం.. భారీగా తరలివస్తోన్న భక్తులు