software employee suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రంథాలయాభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ అక్కిరాజు గణేశ్ పెద్ద కుమారుడు అజయ్ (29) ఆదివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణంలోని 14నెంబర్ బస్తీకి చెందిన అరుణ్‌కు 6 నెలల కిందట వివాహమైంది. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి. బీటెక్ పూర్తి చేసిన అజయ్ బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అయితే ఈ ఉద్యోగం కోసం ఓ ప్రైవేటు ఏజెన్సీకి రూ.3లక్షలు చెల్లించాడు. కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతనికి జీతం రావడం లేదు.
చదుకున్న చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడం, చేస్తున్న పనికి జీతం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రెండు రోజుల క్రితం తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో.. గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంత సేపటికి తలుపులు తెరవకపోవడంతో అనుమానమొచ్చి చూడగా.. మృతిచెంది ఉన్నాడు. ఈ విషయమై మృతుడి తండ్రి గణేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మృతితో తల్లితండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సాఫ్ట్వేర్ ఏజెన్సీ మోసం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు.