తెలంగాణ

telangana

ETV Bharat / crime

పనిచేస్తుండగా పేలిన ల్యాప్​టాప్​.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని పరిస్థితి విషమం - కడప జిల్లాలో పనిచేస్తుండగా పేలిన ల్యాప్​టాప్​

Laptop Blast: ఎలక్ట్రానిక్​ ఉపకరణాలతో మనం జాగ్రత్తగానే ఉన్నా.. అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. షార్ట్​ సర్క్యూట్​, హెవీ లోడ్​ వర్క్​, రోజులో పరిమితికి మించి వినియోగించడం, విద్యుత్​ సరఫరాలో లోపం.. ఇవన్నీ అగ్నిప్రమాదాలకు కారణమవుతూనే ఉంటాయి. తాజాగా ఏపీలో ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా ల్యాప్​టాప్​ పేలడంతో తీవ్రగాయాలపాలైంది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.

Laptop Blast
పనిచేస్తుండగా పేలిన ల్యాప్​టాప్

By

Published : Apr 18, 2022, 3:14 PM IST

Laptop Blast: ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లి గ్రామంలో ప్రమాదం చోటుచేసుకుంది. వర్క్ ఫ్రం హోమ్​లో భాగంగా గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సుమతి.. ఇంటి దగ్గరే విధులు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా ఉదయం ల్యాప్​​టాప్​​కు ఛార్జింగ్​ పెట్టి ఒడిలో పెట్టుకుని పని చేసుకుంటోంది. ఈ క్రమంలో ల్యాప్​టాప్​ ఒక్కసారిగా పేలింది. ఆ సమయంలో సుమతి గది లోపల లాక్​ వేసుకుని పని చేసుకుంటోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కాపాడటంలో ఆలస్యమయ్యారు.

గదిలోనుంచి మంటలు రావడంతో కుటుంబ సభ్యులు.. తీవ్రంగా శ్రమించి గది తలుపు తీశారు. అనంతరం ఆమెను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే చాలా ఆలస్యమై మంటలు వ్యాపించడంతో పాటు మహిళకు కూడా మంటలు అంటుకున్నాయి. తీవ్రగాయాలతో ఉన్న ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం కడపలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుమతి పరిస్థితి విషమంగా ఉంది. పరీక్షించిన వైద్యులు కడప రిమ్స్​కి తీసుకెళ్లాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details