ఓల్డ్ ఆల్వాల్‌లోని చైతన్య కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి... మేడ్చల్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల తన ఇంటి రెండో అంతస్తు నిర్మాణం కోసం... బ్యాంకు రుణం కోసం ప్రయత్నించాడు. అది మంజూరు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై... ఇంట్లో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బ్యాంకు రుణం రాలేదని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య - Hyderabad latest news
తన ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు రుణం మంజూరుకాలేదనే మనస్తాపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన... అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మనస్తాపంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
వెంటనే స్థానికులు చూసి అతన్ని రక్షించేందుకు ప్రయత్నించి... ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస్ రెడ్డి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: కుటుంబ పత్రం..రాసి పెట్టుకున్నారా?