తెలంగాణ

telangana

ETV Bharat / crime

Software Employee Suicide: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య - Gachibowli Software Employee Suicide

Suicide
Suicide

By

Published : Jun 2, 2022, 10:37 AM IST

Updated : Jun 2, 2022, 11:29 AM IST

10:34 June 02

రూమ్‌మేట్స్‌ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య

Software Employee Suicide: మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌కు చెందిన కృతి సంబ్యాల్‌(27) గచ్చిబౌలికి వలస వచ్చి నానక్‌రాంగూడలోని సాగర్‌ గార్డినియా అపార్టుమెంట్‌లో ఇద్దరు రూమ్‌మేట్స్‌తో కలిసి ఉంటోంది. కాగా కృతి.. అమెజాన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. రూమ్‌మేట్స్‌లో ఒకరు రెండు రోజుల క్రితం దిల్లీ వెళ్లగా మరో యువతి బుధవారం ఫ్లాట్‌కు తాళం వేసుకొని విధులకు వెళ్లింది.

గదిలో ఒంటరిగా ఉన్న కృతి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా స్నేహితుడు సచిన్‌ కుమార్‌కు సందేశం పంపింది. అతను వెంటనే వచ్చి చూసే సరికి తాళం వేసి ఉంది. ఫోన్‌ చేసినా స్పందించలేదు. వెంటనే అతను కృతి రూమ్‌మేట్‌కు ఫోన్‌ చేయగా తాళం పంపింది. తలుపులు తీసి చూడగా కృతి ఉరికి వేలాడుతూ కనిపించింది. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇవీ చూడండి:CM KCR : 'తెలంగాణ సజల, సుజల, సస్యశ్యామలంగా మారింది'

ఒకరినొకరు కాల్చుకొని జవాన్లు మృతి.. ఆ గొడవే కారణం!

Last Updated : Jun 2, 2022, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details