ప్రేమ పేరిట సహజీవనం చేసి.. ప్రియురాలి వద్ద నుంచి రూ. 37 లక్షలు తీసుకుని తప్పించుకు తిరుగుతోన్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.32 లక్షలు సీజ్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిందీ ఘటన.
సహజీవనం చేశాడు.. 37లక్షలతో పరారయ్యాడు.. - ప్రియురాలి నిరసన
ప్రేమ పేరిట మహిళను నమ్మించాడు. కలిసి సహజీవనమూ చేశాడు. బాగుపడదామంటూ వ్యాపారం పేరిట.. ప్రియురాలి నుంచి రూ.లక్షలు తీసుకున్నాడు. తీరా పెళ్లి ఊసు ఎత్తేసరికి ముఖం చాటేసి.. ఇంటి నుంచి పరారయ్యాడు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు.. గత నెలలో కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నేడు ఆ నిందితుడిని పట్టుకున్నారు.
software employee arrest
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న జై.. మాయమాటలతో సహోద్యోగినికి దగ్గరయ్యాడు. ప్రేమ పేరుతో మహిళను నమ్మించి.. మూసాపేట్లో నివాసానికి తీసుకువచ్చాడు. ఆమెతో సహజీవనం చేయడంతో పాటు వ్యాపారం పెడదామంటూ రూ.37 లక్షలు తీసుకొని.. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఇంటి నుంచి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన మహిళ.. గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇవాళ మూసాపేట్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న జై ను అరెస్టు చేశారు.