మైనర్ బాలికను కిడ్నాప్ చేసి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన కంటె నరేష్(37) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం. 2 లోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు. సమీపంలో నివసిస్తున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మైనర్ విద్యార్థినికి గత కొంత కాలంగా ట్యూషన్ చెబుతున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.
గది అద్దెకు తీసుకుని