Software Comapany Cheating: హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిరుద్యోగులను మోసం చేసింది. ఇన్నోహబ్ అనే సంస్థ బ్యాక్‌డోర్ ద్వారా రూ. 2 లక్షలు తీసుకుని ఉద్యోగం ఇచ్చారని... రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి జీతాలు ఇచ్చారని బాధితులు తెలిపారు. రెండు వారాల క్రితం కంపెనీ వెబ్‌సైట్, మెయిల్స్ బ్లాక్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థకు సంబంధించి ఉద్యోగులు బోర్డు లేకపోవడంతో మోసపోయామని గ్రహించి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.
ఈనెల 28న హన్మకొండకు చెందిన యువకుడు ఫిర్యాదు చేశాడని మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ అన్నారు. కొత్తగూడలో ఇన్నోహాబ్ టెక్నాలజీ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ నిరుద్యోగుల నుంచి లక్షన్నరకు పైగా వసూలు చేసి తర్వాత మెయిల్స్ బ్లాక్ చేశారని రవీంద్ర ప్రసాద్ తెలిపారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోం అని చెప్పారని సీఐ పేర్కొన్నారు. బ్యాక్ డోర్ ఉద్యోగాలను నమ్మవద్దని సీఐ స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపెనీకి సంబంధించి కమలేశ్ కుమారి, రాహుల్ అలోక్, వైష్ణవి, ముద్ర, ప్రదీప్‌గా గురించామని వీరంతా హెచ్‌ఆర్, మేనేజ్‌మెంట్‌లకు సంబంధించి వాళ్లుగా సీఐ వివరించారు.