మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతారంలో అర్ధరాత్రి పాములు కలకలం సృష్టించాయి. గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మయ్య ఇంట్లో పదుల సంఖ్యలో పాములు ప్రత్యక్షమై .. స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి.
ఆ ఇంట్లో అర్ధరాత్రి పదుల సంఖ్యలో పాముల కలకలం - అర్ధరాత్రి పాముల కలకలం
ఒక పాము కనిపిస్తేనే ఎంతో ఆందోళన చెందుతాం. అలాంటిది ఒక్కొక్కటిగా కుప్పలు తెప్పలుగా ఎదురుగా వస్తుంటే చచ్చి బతికినంత పనవుతుంది. ఇలాంటిదే ఓ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో జరిగింది.
అర్ధరాత్రి పాముల కలకలం
ఇంటిముందు ఉన్న మరుగు కాలువనుండి పాములు ఒక్కొక్కటిగా ఇంట్లోకి వచ్చినట్లు లక్ష్మయ్య తెలిపారు. అయితే ఆ కాలువలో ఇంకా ఎన్ని సర్పాలున్నాయోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టాడు.. ఆ తర్వాత ఏమైందంటే..?