నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని 55వ పోలింగ్ బూత్ దగ్గర తెరాస-భాజపా వర్గీయుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన వారిని తెరాస నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ... భాజపా శ్రేణులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
పోలింగ్ బూత్ వద్ద ఇరుపార్టీల మధ్య స్వల్ప వాగ్వాదం - నాగర్‌కర్నూల్ జిల్లా వార్తలు
ఓటువేసేందుకు వచ్చిన వారిని తెరాస నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ భాజపా నాయకులు ఆరోపించగా... ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో చోటు చేసుకుంది.
పోలింగ్ బూత్ వద్ద ఇరుపార్టీల మధ్య స్వల్ప వాగ్వాదం
కొద్దిసేపు స్వల్ప ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మహబూబ్ నగర్ పట్టణంలోనూ మంత్రి కాన్వాయి సహా ఎక్కువ మంది పోలింగ్ బూతులోకి వెళ్తున్నారని భాజపా కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి:మహబూబాబాద్‌లో తెరాస-వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ