హాస్టల్లో ఉండటం ఇష్టం లేక.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - mahabubabad crime news
![హాస్టల్లో ఉండటం ఇష్టం లేక.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం student suicide attempt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14943146-308-14943146-1649236176516.jpg)
13:49 April 06
పాఠశాల భవనంపై నుంచి దూకిన ఆరో తరగతి విద్యార్థిని
student suicide attempt: ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. పాఠశాల భవనంపై నుంచి ఆరో తరగతి విద్యార్థిని బానోత్ ఇందు(12) దూకింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెలికట్టలోని ఈ ఘటన చోటుచేసుకొంది. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఉగాది పండుగ కోసం ఇంటికెళ్లిన విద్యార్థినిని.. ఈరోజు తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారు. అయితే హాస్టల్లో ఉండటం ఇష్టం లేకే ఆత్మహత్యాప్రయత్నం చేసినట్లు సమాచారం. బాలిక ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. విద్యార్థిని స్వగ్రామం పెద్దవంగర మండలం బొమ్మకల్ గ్రామం.
ఇదీచూడండి:పరీక్షలో స్టూడెంట్ హైటెక్ కాపీ.. ఏం చేశాడో తెలిస్తే షాక్!