Sexually Harassement: ఆయన వృత్తి తమ దగ్గర చదువుకొనే విద్యార్థులను ప్రయోజకుల్ని చేయడం. కానీ అతను ఆ పనిని మరచి 12 సంవత్సరాల విద్యార్థినిపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా సంతకవిటి మండలం అప్పల అగ్రహారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పై ప్రధాన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై అప్పలరాజు నాలుగు నెలలుగా తమ కుమార్తెను లైంగిక వేధిస్తున్నట్లు తల్లి ఆదిలక్ష్మి తెలిపారు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాల ప్రారంభం కావడంతో పాఠశాలకు ఎందుకు వెళ్లట్లేదని తల్లి ఆదిలక్ష్మి కుమార్తెను అడగగా తాను ఆ పాఠశాలకు వెళ్లను వేరే హాస్టల్లో ఎక్కడైనా వేసేయండి వెళతాను అని ఏడుస్తూ చెప్పింది. దీంతో విషయం ఏం జరిగిందని తల్లి అడగగా ప్రధానోపాధ్యాయుడు తనని రోజూ బాత్రూంలోకి రమ్మని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థిని చెప్పినట్లు తల్లి ఆదిలక్ష్మి గ్రామస్థులకు, ఉపాధ్యాయులకు తెలిపింది.