అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడు... ఆడుకుంటూ వెళ్లి అనంతవాయువుల్లో కలిసిపోయాడు. ఇంటి పక్కన సెప్టిక్ ట్యాంకు కోసం తీసిన గుంతే... బాబు పాలిట యమపాశంగా మారింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సిరిపాటి సాయిరాం, పూలమ్మలకు ఆరుగురు సంతానం. తల్లిదండ్రులు ఇద్దరూ... ఇద్దరు పిల్లలను తీసుకొని కూలీపనికి వెళ్లారు. మిగిలిన నలుగురు పిల్లలు ఇంటి వద్దే ఉన్నాకు. అందులో భాగంగానే చిన్న కుమారుడు మహంకాళి(6) నిన్న మధ్యాహ్నం ఆడుకునేందుకని బయటకి వెళ్లాడు.
సెప్టిక్ ట్యాంకు కోసం తీసిన గుంతలో...
సాయంత్రం వరకూ ఇంటికి రాకపోవడంతో... కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊరంతా వెతికారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో బాబు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ రోడు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల ఇంటిపక్కనే సెప్టింక్ ట్యాంకు కోసం ఓ గుంత తీశారు. వర్షం కారణంగా... ఆ గుంతలో నీరు నిండిపోయింది. పోలీసులకు అనుమానం వచ్చి అందులో గాలించగా... మహంకాళి మృతదేహం లభ్యమైంది. ఇన్నాళ్లూ ప్రాణంగా పెంచుకున్న కుమారుడు గుంతలో నిర్జీవంగా పడి ఉండడాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు... కన్నీరుమున్నీరయ్యారు.