తెలంగాణ

telangana

ETV Bharat / crime

రసాయనాలు మీదపడి ఆరుగురికి తీవ్ర గాయాలు - తెలంగాణ క్రైం వార్తలు

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలోని అమర్ ల్యాబ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు కార్మికుల మీద పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

six-people-seriously-injured-on-chemicals-at-bollaram
రసాయనాలు మీదపడి ఆరుగురికి తీవ్ర గాయాలు

By

Published : Mar 22, 2021, 10:19 PM IST

Updated : Mar 22, 2021, 10:40 PM IST

రసాయనాలు మీదపడి ఆరుగురికి తీవ్ర గాయాలు

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో అమర్ ల్యాబ్ పరిశ్రమలో రసాయనాలు కలుపుతుండగా రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రియాక్టర్​లో రసాయనాలు కార్మికులపై పడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న రమేష్, అశోక్ కుమార్ వర్మ, లగిత్ సింగ్, సోనూ కుమార్, ప్రేమ శంకర్, జైసింగ్ అనే ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

వారిని కేపీహెచ్​బీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమ పోలీస్​స్టేషన్ పక్కనే ఉన్న కూడా ఘటన గురించి తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. కార్మికుల ముఖం, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

ఇదీ చూడండి :150 నుంచి 200 మంది వరకు గాయాలు

Last Updated : Mar 22, 2021, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details