తెలంగాణ

telangana

ETV Bharat / crime

Murder case news: మంత్రాల నెపంతో మతిస్థిమితం లేని వ్యక్తిని చంపేశారు! - తెలంగాణ నేర వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ప్రజలను మూఢనమ్మకాలు వీడడం లేదు. పైగా అనుమానంగా కనిపిస్తే చాలు మంత్రాల నెపంతో చంపేస్తున్నారు. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డు మీద నడుస్తుండగా... మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఆరుగురు వ్యక్తులు కలిసి కొట్టి చంపారు(crime news telugu).

crime news telugu, telangana crime news
వ్యక్తి దారుణ హత్య, తెలంగాణ నేర వార్తలు

By

Published : Nov 13, 2021, 1:02 PM IST

నిజామాబాద్ జిల్లా​లో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో మతిస్థిమితంలేని వ్యక్తిని కొట్టి చంపారు(crime news telugu). మానసిక పరిస్థితి సరిగా లేని ఓ వ్యక్తి రాత్రి రోడ్డుపై వెళ్తుంటే మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఆరుగురు వ్యక్తులు కలిసి హత్య చేశారు(Murder case news).

బోధన్​కు చెందిన చిన్న గంగారాం ఈనెల 1న తప్పిపోయాడని పోలీసు స్టేషన్​లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈనెల 2న నవీపేట్ మండలం ఫతేనగర్​లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా... నివేదికలో హత్యగా తేలింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

రెంజల్ మండలం కిసాన్ తండాకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈనెల 1న రాత్రి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కర్రలు, రాడ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్లి ఫతేనగర్ శివారులో పడేశామని... మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో చంపామని నిందితులు చెప్పినట్లు వెల్లడించారు. నిందితుల్లో కిసాన్ తండాకు చెందిన జీవన్, విక్రమ్, రాఠోడ్ రాజులతో పాటు ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని సీఐ పేర్కొన్నారు. వారందరినీ శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్​కు పంపామని తెలిపారు.

ఇదీ చదవండి:Young girl rape in Mahbubnagar: యువతిపై అత్యాచారం.. ఆపై వీడియో తీసి!

ABOUT THE AUTHOR

...view details