Six buses were burnt in Fire Accident : ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి... మొత్తం ఆరు బస్సులు దగ్ధమయ్యాయి. ఆటోనగర్‌లో మరమ్మతుల కోసం వచ్చిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మిగిలిన బస్సులకు ఆ అగ్నికీలలు వ్యాపించాయి.
ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన ఒక ట్రావెల్ బస్సు, సీబీఐటీ కళాశాలకు చెందిన మరో బస్సు మంటల ధాటికి పూర్తిగా కాలిపోయాయి. వాటి పక్కన ఉన్న మరో నాలుగు ఆర్టీసీ హైర్ బస్సులకూ మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. 20 లక్షల వరకూ నష్టం జరిగి ఉంటుందని షెడ్ నిర్వాహకులు చెబుతున్నారు. దుండగులు ఎవరైనా బస్సులకు నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.