ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని సంజయ్ నగర్లో నివసించే నవనీత, రమేశ్ దంపతుల పెద్ద కుమార్తె రేఖ శ్రీ (18) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా... ఆమె సోదరి దీప శ్రీ టాయిలెట్ క్లీనర్ తాగినట్లు పోలీసులు తెలిపారు.
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి - తెలంగాణ వార్తలు
అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు యత్నించగా ఒకరు మృతి చెందారు. అక్కా ప్రాణాలు కోల్పోగా.. చెల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం
కొంతకాలంగా తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతుండగా వేరు వేరుగా నివాసముంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కాచెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలను ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి:కొత్త సచివాలయ నిర్మాణ పనులపై కొవిడ్ ప్రభావం