Sirpurkar Commission : చటాన్‌పల్లిలో సిర్పుర్కర్ కమిషన్ బృందం పర్యటన - తెలంగాణ వార్తలు
12:05 December 05
చటాన్‌పల్లిలో సిర్పుర్కర్ కమిషన్ బృందం పర్యటన
Sirpurkar Commission : దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన స్థలాన్ని సిర్పుర్కర్ కమిషన్ బృందం పరిశీలించింది. షాద్‌నగర్ చేరుకున్న కమిషన్ సభ్యులు... చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని, దిశ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్నీ పరిశీలించారు. ఎన్‌కౌంటర్ స్థలంలో క్షేత్రస్థాయి అంశాలను పరిశీలించారు. సిర్పుర్కర్ కమిషన్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిర్పుర్కర్ కమిషన్ ఇప్పటి వరకు పలువురిని విచారించింది. ఆగస్టు 21న ప్రారంభమైన కమిషన్ విచారణ.... నవంబర్ 25వ తేదీ వరకు కొనసాగింది. హోంశాఖ కార్యదర్శి రవిగుప్తతో విచారణ మొదలు పెట్టిన కమిషన్ సభ్యులు.. ఆ తర్వాత సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత మహేశ్ భగవత్, సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను కమిషన్ ప్రశ్నించింది. మృతుల కుటుంబసభ్యుల నుంచి సాక్ష్యం నమోదు చేసింది. వచ్చే ఏడాది ఫిభ్రవరిలోపు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:Justice sirpurkar commission : 'నిందితులు మాపై కాల్పులు జరపడం వల్లే మేం ఫైరింగ్ చేశాం'