తెలంగాణ

telangana

ETV Bharat / crime

అమ్మాయి ట్విస్ట్‌: నేను కిడ్నాప్‌ కాలేదు.. పెళ్లి చేసుకున్నా.. - Sirisilla shalini kidnap case updates

అమ్మాయి ట్విస్ట్‌: నేను కిడ్నాప్‌ కాలేదు.. పెళ్లి చేసుకున్నా..
అమ్మాయి ట్విస్ట్‌: నేను కిడ్నాప్‌ కాలేదు.. పెళ్లి చేసుకున్నా..

By

Published : Dec 20, 2022, 3:12 PM IST

Updated : Dec 21, 2022, 7:03 AM IST

15:09 December 20

సిరిసిల్ల యువతి షాలిని కిడ్నాప్‌ ఘటనలో మలుపు

అమ్మాయి ట్విస్ట్‌: నేను కిడ్నాప్‌ కాలేదు.. పెళ్లి చేసుకున్నా..

Sirisilla young woman kidnap case updates:రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ముడపల్లి గ్రామం..! మంగళవారం తెల్లవారుజామున 5గంటల 20నిమిషాలు..! శాలీనీ తన తండ్రితో కలిసి హనుమాన్‌ ఆలయంలో పూజ చేసి వస్తుండగా.. ఒక్కసారిగా దూసుకొచ్చిన కారులో నుంచి దిగిన నలుగురు యువకులు బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లారు. అడ్డువచ్చిన తండ్రిని పక్కకు నెట్టేశారు. హుటాహుటిన పోలీసుస్టేషన్‌కు చేరుకున్న అమ్మాయి తండ్రి.. ఈ వ్యవహారంపై సమాచారం అందించాడు. జ్ఞానేశ్వర్‌ అలియాస్‌ జానీ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి తన కూతురిని కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాలతో అన్వేషణ ప్రారంభించింది.

ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపడంతో గవర్నర్‌ తమిళిసై స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు. అటు మంత్రి కేటీఆర్​ కూడా స్వయంగా స్పందించారు. వేములవాడ పర్యటనలో ఉన్న ఆయన సిరిసిల్ల జిల్లా ఎస్పీని పిలిచి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు.. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా నలుగురిలో ఇద్దరిని వేములవాడ వద్ద పట్టుకున్నారు. వారిని విచారించేలోపే సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది.

కిడ్నాప్‌ చేశాడని ఆరోపిస్తున్న అబ్బాయితో కలిసి అమ్మాయి ఒక వీడియోను విడుదల చేసింది. తనను ఎవరు అపహరించలేదని.. ఇష్టపూర్వకంగానే కొండగట్టులో ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. కారులో ఎక్కే సమయంలో అబ్బాయికి మాస్క్‌ ఉండటంతో గుర్తుపట్టలేదని తెలిపింది. కొండగట్టులోనే విచారణ పూర్తిచేసిన పోలీసులు.. ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇష్టాపురకంగానే పెళ్లి చేసుకున్నానని.. కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని అమ్మాయి తెలపడంతో అవసరమైన చర్యలు చేపడుతామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఏడాది క్రితమే షాలిని, జ్ఞానేశ్వర్ పారిపోయి పెళ్లి చేసుకోగా.. శాలిని మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. దీంతో ఏడాది నుంచి శాలిని, జ్ఞానేశ్వర్ వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ప్రస్తుతం మైనార్టీ తీరిపోవడంతో తనని తీసుకెళ్లాలని.. జ్ఞానేశ్వర్‌ను కోరింది. దీంతో పథకంప్రకారం షాలినిని ఇంటి దగ్గర్నుంచి తీసుకెళ్లాడు.

"నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి నేను నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. కారులో ఎక్కే సమయంలో అబ్బాయికి మాస్క్‌ ఉండటంతో గుర్తుపట్టలేకపోయా.. మేము ఇద్దరం ఇష్టాపురకంగానే కొండగట్టలులో పెళ్లి చేసుకున్నాం. కుటుంబ సభ్యుల నుంచి మాకు ప్రాణ హాని ఉంది".- శాలిని

"అబ్బాయి, అమ్మాయి ఏం చెప్పాంటే వాళ్ల ఫ్యామిళీ నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు. దీంతో తల్లిదండ్రుల్ని పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చాం. అమ్మాయి, అబ్బాయికి కూడా చెప్పాం. వారిపై నిఘా పెడతాం."-రాహుల్ హెగ్డే, సిరిసిల్ల జిల్లా ఎస్పీ

ఇవీ చూడండి..

Last Updated : Dec 21, 2022, 7:03 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details