భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణి వీపీఆర్ఓబీ కంపెనీలో ఓ ఒప్పంద కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గనిలో అంతర్గత రహదారి పనులు జరుగుతోన్న సమయంలో అటుగా వచ్చిన ఓసీ వర్కర్ సత్యనారాయణ గ్రేడర్ వెనుక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
టైర్ కింద పడి సింగరేణి కార్మికుడు మృతి - మణుగూరు సింగరేణి కంపెనీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణి వీపీఆర్ఓబీ కంపెనీలో ప్రమాదం జరిగింది. గనిలో అంతర్గత రహదారి పనులు జరుగుతోన్న సమయంలో ప్రమాదవశాత్తు గ్రేడర్ వెనుక టైర్ కింద పడి ఓ ఒప్పంద కార్మికుడు మృతి చెందాడు.
singareni employee deid
ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:Lockdown effect: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య