తెలంగాణ

telangana

ETV Bharat / crime

రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి - హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి

లారీ ఢీ కొట్టడంతో ఓ సింగరేణి ఉదోగి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

singareni employee dead in Hyderabad accident
హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి

By

Published : Jun 20, 2021, 8:37 PM IST

హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలోని గోశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి చెందాడు. విధులకు వెళుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ అతన్ని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.

ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం కొల్లాపూర్ గ్రామానికి చెందిన సుదర్శన్ (45) కొంతకాలంగా హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే విధులకు హాజరవ్వడానికి వెళుతోన్న క్రమంలో లారీ అతన్ని ఢీ కొట్టింది. తీవ్రగాయాలపాలైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యా, కుమారుడు ఉన్నారు. సుదర్శన్ గతంలో ఇల్లందులో స్పోర్ట్స్ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహించాడు.

ఇదీ చదవండి:Brutal murder: కారుని అడ్డుకుని.. కత్తులతో పొడిచి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details